ఆంధ్ర ప్రదేశ్
Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వరుస సెలవులతో పాటు పెరటాశి మూడో శనివారం కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భక్తులను క్యూలైన్లలోకి విడతలవారీగా అనుమతిస్తున్నారు.
శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. శీఘ్రదర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు కూడా 5 గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న 78,723 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.



