జాతియం
బాణసంచాపై సుప్రీం కీలక నిర్ణయం.. పూర్తిగా నిషేధానికి నో!

దీపావళి వేళ బాణసంచా కాల్చడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాణసంచాపై పూర్తిగా నిషేధం విధించేందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది. అదే సమయంలో రోజంతా ఎలాంటి పరిమితులు లేకుండా బాణసంచా కాల్చేందుకు అనుమతించలేమని తేల్చిచెప్పింది.
దీపావళితో ముడిపడిన మతపరమైన భావాలను గౌరవిస్తూనే.. వాయు కాలుష్యం వల్ల పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి ఎదురయ్యే ఇబ్బందులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ధర్మాసనం పేర్కొంది.



