అంతర్జాతీయం
బంగారు గని కూలి 70 మంది మృతి..

సూడాన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బంగారు గని కూలిన ఘటనలో మృతుల సంఖ్య 70కి చేరింది. గని కూలిపోవడంతో పలువురు కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. గనిలో ఇంకా పలువురు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.



