ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది… మొత్తం 163 పోస్టులతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 6 నుంచి 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గ్రూప్-1 కొలువుల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ నోటిఫికేషన్లో డిప్యూటీ కలెక్టర్లు 11, ట్యాక్స్ సర్వీసెస్ అసిస్టెంట్ కమిషనర్లు 14, డీఎస్పీ సివిల్ 36, డీఎస్పీ కమ్యూనికేషన్స్ 3, డీఈవోలు 14 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ 1, ఆర్డీవోలు 3, డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సర్వీసెస్ 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అలాగే గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ 12, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 2, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 3, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 14, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ 35 పోస్టులు ఉన్నాయి. గ్రూప్-1 కొలువుల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.



