తెలంగాణ
మహేష్ గౌడ్, అద్దంకి దయాకర్‌లపై హరీష్ రావు పరువు నష్టం కేసు

తనపై క్షుద్ర పూజలు చేశారంటూ నిరాధార ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలపై మాజీ మంత్రి హరీష్ రావు న్యాయపోరాటానికి దిగారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఆయన, ఇప్పటికే వారికి లీగల్ నోటీసులు పంపారు. తాజాగా ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టులో వారిపై పరువు నష్టం దావా వేశారు. ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరై హరీష్ రావు తన స్టేట్‌మెంట్ నమోదు చేయనున్నారు.



