తెలంగాణ

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్‌ ఆదేశం

హైదరాబాద్‌లో కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ అంశం మరోసారి రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. కేసీఆర్‌కు 700 ఎకరాల ఫామ్‌హౌస్‌ ఉందా? లేదా? అనే అంశంపై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లోగా విచారణ జరిపి వాస్తవాలను తేల్చాలని శాసనసభ వేదికగా అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో కేటీఆర్‌ జన్వాడ ఫామ్‌హౌస్‌ వ్యవహారంపైనా రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

“నేనెందుకు బాంబులు వేస్తా? నేనేమైనా బిన్‌ లాడెన్‌నా?” అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఎన్నికల ముందు స్టీఫెన్‌సన్‌కు నజరానా ఇచ్చారని, రూ.50 కోట్ల విలువైన భూమిని 1 కోటి 53 లక్షల రూపాయల రెగ్యులరైజ్‌ చేశారని ఆరోపించారు. త్వరలో ఎల్బీనగర్‌ నియోజకవర్గంలో స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామని సీఎం ప్రకటించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button