KTR: జాబ్ క్యాలెండర్ కాదు.. జాబ్ లెస్ క్యాలెండర్

KTR: రేవంత్ సర్కార్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విరుచుకుపడ్డారు. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. యువతను చట్టసభల్లో ప్రకటించిన జాబ్ క్యాలెండర్ కూడా అమలు కాకపోతే ఏమనాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్.. జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని ఎద్దేవా చేశారు.
ఉద్యోగాల గురించి అడిగితే.. సీఎం ఎండ్రిన్ తాగి చావండి అంటున్నారని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లాలో ఓ నిరుద్యోగ యువకుడు లేఖ రాసి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఆ యువకుడు రాసిన సూసైడ్ నోట్‌ను చదివే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు.
రాష్ట్రంలో యువత, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదన్నారు. నిరుద్యోగ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన కేటీఆర్ చేశారు.



