తెలంగాణ
కొత్తగూడెంలో దారుణం.. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్

భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో దారుణం చోటు చేసుకుంది.రామవరంలో ఒక మైనర్ బాలిక నలుగురు యువకులు గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన ఉదంతం ఆలస్యంగా బయటపడింది. స్నేహం పేరుతో ఒక యువకుడు సదరు మైనర్ బాలికకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత స్నేహం నటిస్తూనే.. తన స్నేహితులతో కలిసి మొత్తం ముగ్గురు యువకులు బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టారు.
బాధితురాలు విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.



