ఆంధ్ర ప్రదేశ్
సాయికృష్ణ కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

సాయికృష్ణ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. సీసీ ఫుటేజ్ కోసం సిట్ ఇన్వెస్టిగేషన్ ముమ్మరం చేసింది. ఘటనకు ముందు రికార్డయిన సీసీ ఫుటేజ్ మాయమైంది. ఫుటేజ్‌ను రికవరీ చేసేందుకు నెట్‌వర్క్ వీడియో రికార్డింగ్ కీలకంగా మారింది.
ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్‌లో హార్డ్ డిస్క్‌లు ఉన్నాయి. ఫుటేజ్‌ను డిలీట్ చేసిన టైమ్, లాగిన్‌ను NVR నిక్షిప్తం చేస్తుంది. డిలీట్‌కి ముందు 20 సెకన్ల డేటాని NVR ఆపరేటింగ్ సిస్టమ్ భద్రపరుస్తుంది. ఆ 20 సెకన్ల వీడియోతో సీసీ ఫుటేజ్ డిలీట్ చేసిన వారి గుట్టు బయటపడే చాన్స్ ఉంది.



