News
గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌కు బెయిల్ మంజూరు

గోల్డ్ మ్యాన్ సూర్య భాయ్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం బెయిల్ ప్రక్రియ పూర్తి కావడంతో, చంచల్‌గూడ జైలులో ఉన్న ఆయన విడుదలయ్యారుతనపై కావాలనే కుట్ర పన్ని ఈ కేసులో ఇరికించారని సూర్య భాయ్ ఆరోపించారు. కనీసం స్టేషన్ బెయిల్ కూడా రాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించారని మండిపడ్డారు.
ఈ కేసులో తాను రెండు రోజుల పాటు జైలు జీవితం గడిపానని, అది కూడా తనకు ఒక మంచి అనుభవమని అన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని స్పష్టం చేసిన సూర్య భాయ్.. జరిగిన విషయాలన్నీ ఆ భగవంతుడే చూసుకుంటాడంటూ అని అన్నారు.



