News

సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్” నుంచి సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

-బిజినెస్ సర్కిల్స్ లో ఆసక్తి కలిగిస్తున్న మూవీ, బిగ్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ తో జరుగుతున్న బిజినెస్ డిస్కషన్స్

-త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న “కిల్లర్” సినిమా

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, లీడ్ రోల్స్ లో నటిస్తున్న సెన్సేషనల్ సై ఫై థ్రిల్లర్ మూవీ “కిల్లర్”. మనీష్ గిలాడా, చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ధ్యానం నాన్నగారు ఆశీస్సులతో థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్ పై పూర్వాజ్ , పద్మనాభ రెడ్డి.ఎ. నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ సహా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.

ఈ రోజు సూపర్ టాలెంటెడ్ హీరోయిన్ జ్యోతి పూర్వజ్ బర్త్ డే సందర్భంగా ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తూ “కిల్లర్” చిత్రం నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సూపర్ వుమెన్ గా, మిస్టీరియస్ వుమెన్ గా జ్యోతి పూర్వజ్ ఎలక్ట్రిఫైయింగ్ లుక్స్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. మెలిఫిసెంట్ మూవీలో ఏంజెలీనా జోలిని తలపించేలా జ్యోతి పూర్వజ్ లుక్స్ ఉండటం విశేషం. “కిల్లర్” సినిమాలో సూపర్ షీ క్యారెక్టర్ లో జ్యోతి పూర్వజ్ నటన ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనుంది.

“కిల్లర్” సినిమాలో ప్రేక్షకులు మర్చిపోలేని ఒక ప్రపంచాన్ని డైరెక్టర్ పూర్వాజ్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సీఎన్ఏ ఇంటిగ్రేషన్, రాయ్ ప్రోటోకాల్ కోసం వర్క్ చేసే సైంటిస్ట్ గా కనిపించబోతున్నారు.

“కిల్లర్” సినిమా ప్రోగ్రెస్ గురించి డైరెక్టర్ పూర్వాజ్ మాట్లాడుతూ – మా “కిల్లర్” సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. భారీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉండటం వల్ల కొంచెం ఎక్కువ సమయం పట్టింది. ఇప్పుడు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కూడా పూర్తయ్యాయి. మరోవైపు బిజినెస్ టాక్స్ జరుగుతున్నాయి. ఇండస్ట్రీలోని పలువురు టాప్ డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ మా ప్రొడ్యూసర్స్ తో కలిసి సినిమా చూశారు. సినిమా ఔట్ పుట్ పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు. త్వరలోనే బిజినెస్ డీల్స్ కంప్లీట్ చేసుకుని సెన్సార్ పూర్తి చేసి మా సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొస్తాం అన్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button