News
ఏపీ శాసనమండలిలో గందరగోళం

ఏపీ శాసన మండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది. డీఎస్సీ అంశంపై చర్చించాలని వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే వైసీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు.
దీంతో వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. డీఎస్సీపై వెంటనే చర్చ చేపట్టాలని నినాదాలు చేశారు. మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి.. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అంటూ నినాదాలు చేశారు.



