News
పిడుగుపాటుకు మహిళ మృతి

నిర్మల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పిడుగుపాటుకు ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ముథోల్ మండలం గన్నోర గ్రామానికి చెందిన నర్మద అనే 55 ఏళ్ల మహిళ మరో ఇద్దరు మహిళలతో కలిసి రైతు పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా వర్షం ప్రారంభమైంది. దీంతో ముగ్గురు ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో నర్మద అక్కడికక్కడే మృతి చెందింది. ఆమెతో ఉన్న మరో ఇద్దరు మహిళలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో గన్నోర గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.



