ఆంధ్ర ప్రదేశ్

తాడిపత్రిలో హై టెన్షన్ .. వైసీపీ vs పోలీసులు..!

అనంతపురం వైసీపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. తాడిపత్రి వెళ్లేందుకు ప్రయత్నించిన.. అనంత వెంకటరామిరెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ ఆఫీస్ గేట్లు తోసుకుని వైసీపీ నేతలు, కార్యకర్తలు బయటకు వచ్చారు. వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీస్ వాహనానికి అడ్డుగా నిలబడి వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు, వైసీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. అటు తాడిపత్రిలోనూ హైటెన్షన్ నెలకొంది. రోడ్డుపై ధర్నాకు దిగిన కేతిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button