ఆంధ్ర ప్రదేశ్
గుంటూరులో మహిళపై దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

గుంటూరులో మహిళపై జరిగిన దాడి ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులపై ఎలాంటి ఉపేక్ష లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మహిళలపై దాడులను ప్రభుత్వం ఏమాత్రం సహించదని స్పష్టం చేసిన సీఎం చట్టం ముందు అందరూ సమానమేనని తేల్చి చెప్పారు.
మహిళల గౌరవానికి భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతకు ప్రభుత్వం పూర్తి భరోసా కల్పిస్తుందని, బాధితులకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని చంద్రబాబు పేర్కొన్నారు.



