ఆంధ్ర ప్రదేశ్

తిరుమలలో వైభవంగా జ్యేష్ఠాభిషేకం

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా మలయప్పస్వామి వారికి అలంకరించే స్వర్ణ కవచాలను తొలగించి, ఉత్సవమూర్తులకు ప్రత్యేక స్నపన తిరుమంజనం నిర్వహించడం ఈ ఉత్సవాల ప్రత్యేకత.

యాగశాలలో శాంతిహోమం, కంకణధారణతో మొదలైన ఈ వేడుకలు మూడు రోజుల పాటు కొనసాగనున్నాయి. మొదటి రోజు స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించి, సాయంత్రం వజ్రకవచాలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పలు ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button