సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి కీర్తి సురేశ్

తిరుమల శ్రీవారిని సినీనటి కీర్తి సురేశ్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. కీర్తి సురేశ్ శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశ్వీరచనం అందజేసి స్వామివారి తీర్ధాప్రసాదాలను అందజేశారు. నటుడు విక్టరీ వెంకటేష్ కధానాయకుడిగా నటిస్తున్న చిత్రంలో నటిస్తున్నట్లు నటి కీర్తి సురేశ్ తెలిపారు. అనంతరం నటి కీర్తి సురేశ్ చూసేందుకు భక్తులు ఉత్సహం చూపారు.



