తెలంగాణ

ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎంపీ ఈటల విమర్శలు

దూలపల్లిలో హైడ్రా కూల్చివేతల అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఫాక్స్ సాగర్ సుందరీకరణలో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్న స్మాల్ స్కేల్ పరిశ్రమల కూల్చివేతలను వ్యతిరేకిస్తూ దూలపల్లి ఇండస్ట్రియల్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశానికి బీజేపీ మద్దతు ప్రకటించింది. ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఫైరయ్యారు. సరైన నోటీసులు, చట్టపరమైన ప్రక్రియ లేకుండా పరిశ్రమలను కూల్చివేయడం సరికాదని ఈటల రాజేందర్ అన్నారు. పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల కుటుంబాల ఉపాధిని దెబ్బతీయొద్దని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పారిశ్రామికవేత్తలు, కార్మికులకు బీజేపీ అండగా ఉంటుందని గిరి వర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button