ఆంధ్ర ప్రదేశ్
తాడేపల్లిలో జగన్తో వైసీపీ నేతల కీలక భేటీ

తాడేపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఏలూరు, నర్సాపురం జిల్లాల పార్టీ అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో జగన్ భేటీ అయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ నేతలతో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.
జిల్లా అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలతో జగన్ ఒక్కొక్కరితో విడివిడిగా మాట్లాడుతున్నారు. స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.



