అంతర్జాతీయం
నైజీరియా లో కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం.. 32 మంది మృతి

నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నైజీరియా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానం ఇగ్బోకోడా ప్రాంతంలో కుప్పకూలింది.బెనిన్ సిటీ నుంచి లాగోస్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ విమానంలో మొత్తం 32 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.మృతుల్లో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఓండో రాష్ట్రంలోని నావల్ బేస్ సమీపంలో విమానం శకలాలను గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టాలని నైజీరియా అధ్యక్షుడు ఆదేశించారు.



