ఆంధ్ర ప్రదేశ్
స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం చంద్రబాబు ఫోకస్

స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. కుప్పంపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జరిగే అన్ని కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు.
పార్టీ బలోపేతంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. ఇకపై ప్రతి రెండు నెలలకు ఒకసారి కుప్పంలో పర్యటించి పరిస్థితులను సమీక్షిస్తానని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అలాగే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న నాయకులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సీఎం సూచించారు.



