News

పెరూలో భారీ భూకంపం.. ఐదుగురు మృతి

పెరూలో భారీ భూకంపం సంభవించింది. పెరూలోని ఆండిస్‌ ప్రాంతంలో ఒక్కసారిగా భూమి తీవ్రంగా కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. హువాంకాయో ప్రావిన్సులోని సికాయా నగరానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే ఈ భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ ఉపరితలం నుంచి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అమెరికా జియోలాజికల్‌ సర్వే స్పష్టం చేసింది.

ఈ భూకంప ధాటికి స్థానికంగా ఉన్న ఒక చర్చి, కాన్వెంట్‌తో పాటు పలు ఇళ్లు, భవనాలు భారీగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. బాధితులను ఆసుపత్రికి తరలించడంతో పాటు, ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న దాదాపు 300 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button