తెలంగాణ
MLC Kavitha: శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు

MLC Kavitha: శాసనమండలిలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. జయహే జయహే తెలంగాణ గీతంపై ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్‌తో పాట రూపొందించడం ఎవరికి అర్థం కాని విషయమని ఫైర్ అయ్యారు. మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్ లేనట్టు ఆంధ్రవారితో రూపొందించడం ఏంటని ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ తల్లికి దండ వేయని వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహ రూపం రూపొందించారని దుయ్యబట్టారు. మరోవైపు.. 2.64 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చింది అంటే అందులో కాళేశ్వరం పాత్ర కూడా ఉందని వెల్లడించారు.