తెలంగాణ
కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు

కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు కాపీలో కీలక అంశాలు వెలుగు చూశాయి. కమిషన్ ఏర్పాటు చట్టబద్ధమేనని కోర్టు తీర్పులో వెల్లడించింది. జీవోఎంఎస్ నెంబర్ 6 ప్రకారం కమిషన్ ఏర్పాటు సరైనదేనని కోర్టు అభిప్రాయపడింది. కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. పిటిషనర్ల ప్రతిష్టకు నష్టం కలిగించేలా నివేదిక ఉందని కోర్టు అభిప్రాయపడింది. సహజ న్యాయ సూత్రాలు ఉల్లంఘించబడ్డాయని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెక్షన్ 8B నిబంధనలు పాటించలేదని స్పష్టం చేసింది. ఫైండింగ్స్ ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది.



