News
అషు రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ

ఎన్‌ఆర్‌ఐను మోసం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అషు రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్‌ఆర్‌ఐ నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసి, తిరిగి ఇవ్వకుండా మోసం చేశారని అషు రెడ్డిపై హైదరాబాద్‌లోని సిటి సివిల్ కోర్టు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఈ కేసులో పోలీసులు తనను అరెస్టు చేసే అవకాశం ఉందని భావించిన అషు రెడ్డి, ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అషు రెడ్డిపై సెక్షన్ 420 చీటింగ్‌తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.



