జాతియం
తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు

తమిళనాడులో రిసార్ట్ రాజకీయాలు మొదలయ్యాయి. మహాబలిపురంలోని రిసార్ట్‌కు టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆలస్యం అవుతుండటంతో విజయ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మహాబలిపురంలో పూంజేరు రిసార్ట్ బుక్ చేసిన విజయ్.. అక్కడికి టీవీకే ఎమ్మెల్యేలను తరలిస్తున్నారు. మరోవైపు తిరుచ్చి ఈస్ట్ నియోజకవర్గానికి విజయ్ రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. పెరంబూర్ ఎమ్మెల్యేగా విజయ్ కొనసాగనున్నారు.



