తెలంగాణ

సిఎం రేవంత్ రెడ్డికి కొండూరి రవీందర్ రావు లీగల్ నోటీసు

సీఎం రేవంత్‌రెడ్డికి నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు లీగల్‌ నోటీసు జారీ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా మారింది. అసెంబ్లీ వేదికగా తనపై చేసిన భూకబ్జా ఆరోపణలకు ఆధారాలు చూపించాలని రవీందర్‌రావు డిమాండ్‌ చేశారు. ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఖండించిన ఆయన.. ఏడు రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని నోటీసులో తెలిపారు.

లేదంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎం వ్యాఖ్యలతో తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్టకు నష్టం కలిగిందని రవీందర్‌రావు పేర్కొన్నారు. మరోవైపు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా సీఎం వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. దీంతో ఈ లీగల్‌ నోటీసు వ్యవహారం రాజకీయంగా ఎలాంటి మలుపు తిరుగుతుందనేది ఆసక్తిగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button