News
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ త్రిష

తిరుమల శ్రీవారిని హీరోయిన్ త్రిష దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమల వచ్చిన ఆమె, ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయక మండపంలో పండితులు వేద ఆశీర్వచనం పలుకుగా ఆలయ సిబ్బంది ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు…
మరికొద్ది గంటల్లో తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడునున్న నేపథ్యం, విజయ్ రాజకీయ భవితవ్యం కూడా తేలనున్న నేపథ్యంలో ఆమె విజయ్ విజయం కోసం ప్రత్యేక పూజలు చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వస్తున్నాయి.



