జాతియం

NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం

NEET Re Exam: నీట్ రీ-ఎగ్జామ్‌ వేళ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షా పత్రాల లీకేజీలు, అక్రమాలకు తావులేకుండా ఉండేందుకు చర్యలు చేపడుతూ, ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘టెలిగ్రాం’పై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ జరగనున్న నేపథ్యంలో, ఈ నెల 22 వరకు టెలిగ్రాం సేవలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

పరీక్షా సమయాల్లో అక్రమాలకు పాల్పడకుండా ఉండేందుకు, ముఖ్యంగా టెలిగ్రాం వేదికగా జరిగే సమాచార మార్పిడిని అడ్డుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా నీట్ పరీక్ష వివాదాల్లో ఉన్న నేపథ్యంలో, ఈసారి ఎలాంటి లోపాలు జరగకుండా పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button