ఆంధ్ర ప్రదేశ్
బాలుడి ప్రాణం తీసిన టిప్పర్ లారీ

నెల్లూరు జిల్లా సైదాపురంలో ఘోరం జరిగింది. టిప్పర్ లారీ ఢీకొని బాలుడు మృతి చెందాడు. గుంతను తప్పించబోయిన టిప్పర్ లారీ దుకాణం పైకి దూసుకెళ్లడంతో దక్షేష్ అనే బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



