తెలంగాణ

భానుడి భగభగలు..అగ్ని గుండంలా తెలంగాణ

తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. భానుడి భగభగలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. పలు జిల్లాల్లో హీట్‌వేవ్ తీవ్రరూపం దాల్చడంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మంలో అత్యధికంగా 45.4 డిగ్రీలు, ఆదిలాబాద్‌లో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రామగుండంలో 45. 1, హనుమకొండలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..

కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర వడగాలులు వీయడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 26 వరకు హీట్‌వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. తరచూ నీరు, ORS, మజ్జిగ తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button