జాతియం
CM Vijay: అవినీతి అధికారులను పట్టిస్తే రూ.లక్ష బహుమతి

తమిళనాడులో అవినీతిపై సీఎం విజయ్ సంచలన ప్రకటన చేశారు.అవినీతి అధికారులను పట్టించిన వారికి ఏకంగా లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. వెయ్యి రూపాయల లంచం అడిగినా వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు విజయ్.
అవినీతి నిరోధక శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తానని స్పష్టం చేశారు. లంచగొండ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రజల సహకారంతో అవినీతికి చెక్ పెడతామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును గోప్యంగా పరిశీలిస్తామని కూడా హామీ ఇచ్చారు.



