News
కులగణనపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

దేశంలో కులగణన ప్రక్రియకు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జనగణనలో కులాల లెక్కింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లను చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పూర్తిగా కొట్టివేసింది. సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలుకు కులగణన తప్పనిసరి అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
వెనుకబడిన కులాల ఖచ్చితమైన జనాభా తెలిసినప్పుడే సమాజంలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని కోర్టు అభిప్రాయపడింది. అంతేకాకుండా, కులగణన అనేది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో కోర్టుల జోక్యం ఉండబోదని సీజేఐ సూర్యకాంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తాజా తీర్పుతో దేశవ్యాప్తంగా కులగణన జరగడానికి ఉన్న అన్ని న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయి.



