జాతియం

నేడు దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్.!

దేశవ్యాప్తంగా నేడు ఫార్మసీల సమ్మె కొనసాగుతోంది. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపుతో మెడికల్ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలను నియంత్రించాలని భారీ డిస్కౌంట్లపై కట్టడి విధించాలని ఫార్మసీ యజమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈ-ఫార్మసీల వల్ల చిన్న మెడికల్ షాపులు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సమ్మె కారణంగా పలు ప్రాంతాల్లో మందుల కొనుగోలుకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సేవలకు మాత్రం కొంత మినహాయింపు ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం చూపాలని ఫార్మసీ సంఘాలు కోరుతున్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button