తెలంగాణ
నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. డీలిమిటేషన్ అజెండాతో ఢిల్లీకి సీఎం రేవంత్ వెళ్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల వాదనకు జాతీయ స్థాయిలో బలం కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రోరేటాకు వ్యతిరేకంగా దక్షిణాది సీఎంలను సమన్వయం చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రులకు రేవంత్ లేఖలు రాశారు. హైబ్రిడ్ మోడల్ కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలతో రేవంత్ టచ్ లో ఉన్నారు. దక్షిణ రాష్ట్రాలను ఒక్కతాటిపైకి తేవడంపై ఫోకస్ పెట్టారు.



