తెలంగాణ
ప్రధాని మోడీకి సీఎం రేవంత్రెడ్డి మరో లేఖ

రేపు పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్, మహిళా బిల్లులు రానున్నాయి. లోక్సభ స్థానాలను 850కి పెంచాలని కేంద్రం నిర్ణయించింది. లోక్సభ సీట్ల పెంపు విధానంపై సీఎం రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. డీలిమిటేషన్ పై అభ్యంతరాలు చెబుతూ ప్రధానికి రేవంత్ మరో లేఖ రాశారు. విపక్షాలతో చర్చించి.. హైబ్రిడ్ మోడల్ పాటించాలంటున్నారు.
ఆర్థిక ప్రగతి, జనాభా ఆధారంగా సీట్లు పెంచాలని రేవంత్ ప్రతిపాదించారు. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల ఐక్యతకు సీఎం రేవంత్ పిలుపునిచ్చారు. ఇవాళ ఢిల్లీలో జరిగే ఇండీ కూటమి భేటీకి సీఎం రేవంత్ హాజరుకానున్నారు. అయితే.. డీలిమిటేషన్ తో దక్షిణాదికి ఎలాంటి అన్యాయం జరగదంటూ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.



