ఆంధ్ర ప్రదేశ్
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. నిందితుల కామన్ పాయింట్ ను పోలీసులు గుర్తించారు. ఆన్లైన్ గేమ్ ద్వారా నిందితులు ఒకరికొకరు పరిచయమయ్యారు. ఫ్రీ ఫైర్ అనే ఆన్లైన్ వీడియో గేమ్ ద్వారా యువత వివరాలను విదేశీ హ్యాండ్లర్లు సేకరించారు. ఫ్రీ ఫైర్ గేమ్ నుంచి ఇన్స్టాకు కమ్యూనికేషన్ మళ్లింది. నిందితుల కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు. భారత్లో జాతీయ జెండాకు బదులు.. ఐసిస్ జెండా పెట్టడమే తమ టార్గెట్ అని నిందితులు తెలిపారు.



