తెలంగాణ
Makkan Singh: ఎవడైనా అడ్డంగా మాట్లాడితే.. నరుకుతం.. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎవడన్నా అడ్డంగా మాట్లాడితే.. అడ్డంగా నరుకుతం’ అంటూ ఆయన మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావుపాటు రాజ్‌ఠాకూర్ మక్కాన్ సింగ్ పాల్గొన్నారు. మంత్రి శ్రీధరన్న ఇక్కడ ఉండక పోవచ్చని.. రెండు గంటల్లో ఇక్కడ ఉన్న తాము ముగ్గురం ఒక్క క్షణంలో వస్తామని చెప్పారు.



