సినిమా
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బండ్ల గణేష్

సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో బండ్ల గణేష్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయంలోకి వెళ్లిన బండ్ల గణేష్ స్వామివారిని దర్శించుకొని మ్రొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసారు.



