జాతియం
ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ

ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ రాశారు. పోలింగ్ సమయాన్ని 2 గంటలు పొడిగించాలని విజ్నప్తి చేశారు. ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు చేరుకోలేకపోతున్నారని విజయ్ లేఖలో పేర్కొన్నారు. చెన్నైలోని కోయంబేడు, కిలంబాక్కం బస్టాండ్లలో బస్సుల కోసం జనం క్యూలు కడుతున్నారు. రవాణా శాఖ వైఫల్యంపై విజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని డిమాండ్ చేశారు.



