సినిమా

అనిరుధ్-కావ్య మారన్ పెళ్లి?

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్‌ను సన్ గ్రూప్ యజమాని కుమార్తె కావ్య మారన్ పెళ్లి చేసుకోబోతోందన్న పుకార్లు మళ్లీ జోరుగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే న్యూయార్క్‌లో ఇద్దరూ కలిసి కనిపించిన వీడియో వైరల్ అయింది. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ పెళ్లి వార్తలు మళ్లీ హాట్ టాపిక్‌గా మారాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో ఆయన పెళ్లి ఖరారు అయిందన్న పుకార్లు గతంలోనే వచ్చాయి. ఆ సమయంలో అనిరుధ్ స్వయంగా ఖండించారు. కానీ ఇప్పుడు న్యూయార్క్‌లో ఓ యూకే యూట్యూబర్ వ్లాగ్‌లో అనిరుధ్-కావ్య జంటగా కనిపించడంతో పుకార్లు మళ్లీ రెచ్చిపోయాయి.

ఇద్దరూ కలిసి ట్రిప్‌కు వెళ్లినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. దీంతో.. అనిరుధ్ త్వరలో కళానిధి మారన్‌కు అల్లుడు కాబోతున్నాడన్న చర్చ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం ఇద్దరూ సింగిల్‌గానే ఉన్నారు. కెరీర్‌లో బిజీగా ఉన్న ఈ జంట నుంచి అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button