క్రీడలు
Champions Trophy 2025: నేటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం

Champions Trophy 2025: రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. 2017 తర్వాత రద్దయి, మళ్లీ ఇప్పుడు పునరుజ్జీవం పోసుకున్న టోర్నీకి పాకిస్థాన్, UAE ఆతిథ్యమిస్తున్నాయి. ఆతిథ్య జట్టు పాకిస్థానే అయినప్పటికీ.. ఆ దేశంలో పర్యటించేందుకు భారత్ అంగీకరించని నేపథ్యంలో, రోహిత్ సేన ఆడే మ్యాచ్‌లకు దుబాయ్ వేదిక కానుంది.
అన్ని విభాగాల్లో బలంగా కనిపిస్తున్న టీమ్‌ఇండియా టైటిల్ ఫేవరెట్లలో ఒకటి. రేపు బంగ్లాదేశ్ మ్యాచ్‌తో భారత్ తన పోరాటాన్ని ఆరంభిస్తుంది. అంతకంటే ముందు, ఇవాళ పాకిస్థాన్, న్యూజిలాండ్ తొలి మ్యాచ్‌లో తల పడనున్నాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్ టోర్నీలో తలపడుతున్న మిగతా జట్లు. ఇక వెస్టిండీస్, శ్రీలంక టోర్నీకి అర్హత సాధించలేకపోయాయి.