తెలంగాణ
Kishan Reddy: యూరియా కొరతపై స్పందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: తెలంగాణలో యూరియా కొరతపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. యూరియా విషయంలో సాంకేతిక సమస్యలు వచ్చాయని అన్నారు. యూరియాపై తెలంగాణకు 76 వేల కోట్ల సబ్సిడీ ఇచ్చామని స్పష్టం చేశారు. ఎరువుల ధరలను కేంద్రం పెంచలేదని క్లారిటీ ఇచ్చారు.
యూరియాను సమానంగా పంచే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం వద్ద స్టాక్ పెట్టాం.. అదేమైందో తెలియడం లేదని షాకింగ్ కామెంట్స్ చేశారు. యూరియాను పద్ధతి ప్రకారం వాడుకోవాలని చెప్పారు. దుర్వినియోగం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని సూచించారు.



