ఆంధ్ర ప్రదేశ్
ఎస్వీ యూనివర్సిటీలో మరోసారి చిరుత కలకలం

తిరుపతిలో మరోసారి చిరుత కలకలం రేపింది. ఎస్వీ యూనివర్సిటీలోని ఎంప్లాయిస్ క్వార్టర్స్ దగ్గర నాటుకోళ్ల షెడ్‌పై దాడి చేసింది. సీసీ కెమెరాల్లో దాడి దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది తీవ్ర భయాందోళన చెందుతున్నారు.



