జాతియం
కేరళ సీఎం పై కొనసాగుతున్న సస్పెన్స్

కేరళ సీఎంపై సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం రేస్‌లో కేసీ వేణుగోపాల్, రమేశ్ చెన్నితాల ఉన్నారు. ఆదివారం సీఎం అభ్యర్థి పేరు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో కీలక నేతగా కేసీ వేణుగోపాల్ ఉన్నారు. రాహుల్ గాంధీకి వేణుగోపాల్ అత్యంత సన్నిహితుడు. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. మరోవైపు గతంలో హోంమినిస్టర్‌గా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా రమేశ్ చెన్నితాల పని చేశారు. వీరిద్దరి మధ్యే ప్రధాన పోటీ ఉంది.


