తెలంగాణ
ఫార్మా ల్యాబ్‌లో పేలిన రియాక్టర్.. 9 మందికి గాయాలు

నల్గొండ జిల్లాలో ప్రమాదం జరిగింది. నోష్ ఫార్మా ల్యాబ్‌లో రియాక్టర్ పేలింది. ప్రమాదంలో 9 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. చిట్యాల మండలం పిట్టంపల్లిలో ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గత నెల 9న ఇదే ఫార్మా ల్యాబ్‌లోని రెండో బ్లాక్‌లో రియాక్టర్ పేలింది. వరుస ప్రమాదాలపై కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



