News
కొరియోగ్రాఫర్, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన

ప్రముఖ కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడు రాఘవ లారెన్స్ కీలక ప్రకటన చేశారు. తాను రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం ప్రజల అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన ‘ఎక్స్’ ఖాతాలో వీడియో విడుదల చేశారు.
ప్రజలు, అభిమానులు ఆమోదిస్తే తాను రాజకీయ ప్రయాణం ప్రారంభిస్తానని, లేదంటే ఈ ఆలోచనను విరమించుకుంటానని లారెన్స్ తెలిపారు. తిరుచ్చి ఈస్ట్ ఉప ఎన్నిక నుంచి లారెన్స్ పోటీ చేయనున్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో దీనిపై ఆయన వీడియో విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.



