తెలంగాణ

నేడు జగిత్యాలలో కేసీఆర్ బహిరంగ సభ

జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు సిద్ధమైంది. నేడు ప్రజా ఆశీర్వాద సభ పేరుతో నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో సుమారు ఏడాది కాలం తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ సభ ద్వారా పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా కదం తొక్కాలని శ్రేణులు భావిస్తున్నాయి.

ఈ సభలోనే సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. అదే విధంగా జీవన్ రెడ్డి పార్టీలో చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందని నేతలు అభిప్రాయపడ్డారు.

దాదాపు ఏడాది తర్వాత ఆయన ఒక ప్రజా సభలో మాట్లాడనుండటం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. జగిత్యాల నుంచే మళ్లీ పార్టీ పూర్వ వైభవం సాధించడానికి అలాగే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడానికి ప్రజల ఆశీర్వాదమే కీలకమని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు.

సభ విజయవంతం కోసం స్థానిక నాయకులు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు అభిమానులు హాజరుకానున్న ఈ సభ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారనుంది. ఈ సభ బీఆర్ఎస్ పునరుజ్జీవనానికి కీలక మలుపుగా భావిస్తున్నారు.

ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఈ సభలో ఆయన ఎలాంటి విమర్శలు చేస్తారనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button