తెలంగాణ
Karimnagar: ప్రభుత్వ పాఠశాల బాత్రూంలో సీసీ కెమెరాలు.. అటెండర్ దారుణాలు బట్టబయలు

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థినులను అసభ్యకరంగా తాకుతూ, వాష్‌రూముల్లో కెమెరాలు పెట్టి వీడియోలు తీస్తూ వేధింపులకు గురి చేస్తున్న అటెండర్ యాకుబ్ పాషా బాగోతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కురిక్యాలలో చోటు చేసుకుంది. ఏడాదికాలంగా యాకూబ్ పాషా కీచక పర్వం కొనసాగుతోంది.
ఏడాది క్రితం విద్యార్థులు విషయాన్ని పాఠశాల ఉపాధ్యాయులకు తెలియజేసినా చర్యలు తీసుకోకుండా వార్నింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పాఠశాల ముందు ధర్నాకు దిగారు. బాధ్యుడైన యాకుబ్ పాషాను వెంటనే విధుల నుండి తొలగించాలని, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. చేతకాని ప్రభుత్వ విధానాల వల్ల ఆడవాళ్లకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.



