తెలంగాణ
ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ భేటీ

ఢిల్లీలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రతిపక్ష ఐక్యతకు ఆమె నాయకత్వంపై అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజల తరఫున ప్రియాంక గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. వివాదాస్పద రాజ్యాంగ సవరణపై రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు.
ఇది దక్షిణ, ఈశాన్య రాష్ట్రాల హక్కులు తగ్గించే ప్రయత్నమని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పేరుతో డీలిమిటేషన్ అజెండా ముందుకు తీసుకువచ్చారని విమర్శించారు. దేశ భవిష్యత్తు కోసం ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చాయని రేవంత్ అన్నారు.



